Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ కార్డులో ఆ రెండు కాలమ్స్ తొలగింపు

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (14:09 IST)
దేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కదానికి ఆధారంగా మారింది. ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డును అనుసంధానం చేస్తున్నారు. ఆధార్ నంబరు లేనదే బ్యాంకు ఖాతాను కూడా తెరవలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆధార్ కార్డులో ఉండే తప్పొప్పులను సరి చేసుకునేందుకు ఇంటర్నెట్ సెంటర్‌కు వెళుతుంటారు. 
 
తాజాగా ఆధార్ కార్డు కేంద్రానికి వెళ్లిన కొంద‌రు పౌరులు ఓ కీల‌క విష‌యాన్ని గుర్తించారు. ఆధార్ కార్డును అప్‌డేట్ చేస్తే ఇక‌పై అందులో తండ్రి పేరు/భర్త పేరు అని ఉండదు. సంర‌క్ష‌కుడికి, కార్డుదారుడికి మ‌ధ్య ఉన్న‌ బంధుత్వాన్ని తెలిపే అవ‌కాశం ఉండ‌దు. ఆధార్ కార్డులో ఇకపై తండ్రి లేక‌ భర్త అనే ఆప్ష‌న్ వ‌ద్ద కేరాఫ్ అనే ప‌దం మాత్ర‌మే ఉంటుంది.
 
ఓ ఖాతాదారుడు ఈ విష‌యాన్ని గుర్తించి ఆధార్‌కార్డులో పొరపాటుగా కేరాఫ్ అని ప‌డిందేమో అనుకుని ఆధార్ కేంద్రానికి విషయం తెలిపాడు. అయితే తండ్రి పేరు, భర్త పేరు అనే ప‌దాల‌ను తొల‌గించి కేరాఫ్ అని ఉద్దేశ‌పూర్వ‌కంగానే మార్చామ‌ని అధికారులు తెలిపారు. 
 
ఇకపై ఆధార్ కార్డులో బంధుత్వాన్ని తెలిపే ప‌దాలు ఉండ‌బోవ‌ని, కేరాఫ్ అని ఉంటుందని చెప్పారు. కార్డుదారుడు కేరాఫ్‌లో త‌న సంర‌క్ష‌కుడి పేరును రాస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. పౌరుడి వ్య‌క్తిగ‌త‌ గోప్యత‌కు ఏ విధంగానూ భంగం కలగ‌కూడ‌ద‌ని గ‌తంతో సుప్రీంకోర్టు చేసిన సూచ‌న‌ల మేర‌కు అధికారులు ఈ మార్పులు చేసిన‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments