Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

3 నెల‌ల్లో రైల్వే ప్రాజెక్టులకు భూమి సేకరించి అప్పగిస్తామ‌న్న సిఎస్.

3 నెల‌ల్లో రైల్వే ప్రాజెక్టులకు భూమి సేకరించి అప్పగిస్తామ‌న్న సిఎస్.
విజయవాడ , శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (16:35 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విజయనగరం- టిట్లాఘర్ 3వ రైల్వే లైను ప్రాజెక్టు, నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం తోపాటు కడప-బెంగుళూర్ నూతన రైలు మార్గాలకు సంబంధించి మిగతా భూమి సమీకరించి అప్పగించేందుకు మరో మూడు నెల‌ల గ‌డువును ప్ర‌భుత్వం కోరింది. డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రగతి ప్రాజెక్టులు రైల్వే, బొగ్గు,ఇంధనం,స్టీల్ ప్రాజెక్టులకు చెందిన 13 పెండింగు అంశాలపై ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం ఢిల్లీ నుండి టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్రగతి ప్రాజెక్టుల మానిటరింగ్ గ్రూపు కో-చైర్మన్ అయిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయన,ఎరువులు శాఖామాత్యులు మనీష్ మాండవీయ,  డా.జితేంద్ర సింగ్ లు వీడియో సమావేశం నిర్వహించారు.
 
ఈసందర్భంగా సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విజయనగరం-టిట్లాఘర్,నడికుడి-శ్రీకాళహస్తి,కడప-బెంగుళూరు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మిగతా భూమి సేకరించి అప్పగించేందుకు మరో మూడు మాసాలు సమయం కావాలని విజ్ఞప్తి చేయుగా కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించిందించి ఆగడువులోగా భూమి అప్పగించాలని చెప్పారు.ప్రగతి ప్రాజెక్టులను ప్రధాన మంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నందున  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈవిషయంలో అత్యంత శ్రద్ధ కనపర్చి ఆయా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా తోడ్పడాలని కేంద్ర మంత్రులు సూచించారు.వివిధ రాష్ట్రాల వారీ ప్రగతి ప్రాజెక్టులు పెండింగ్ అంశాలను వారు సిఎస్ లతో సమీక్షించారు.
 
ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ, రైల్వే ప్రాజెక్టులకు భూమి సమీకరణకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని అప్పటికి మిగతా భూమి అప్పగింత ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు. ఇప్పటికే ఆయా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అవసరమైన భూమిలో కొంతమేర రైల్వే శాఖకు అప్పగించగా, మిగతా భూమిపై వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  దీనిలో భాగంగా ప్రభుత్వ భూమిని గుర్తించడం తోపాటు ప్రైవేట్ భూమిని సేకరించి ఇచ్చేందుకు ఆయా భూమి యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ కేంద్ర మంత్రులకు వివరించారు.
 
ఇప్పటి వరకూ ఆయా ప్రాజెక్టులకు భూమి సమీకరించి అందించిన వివరాలను సిఎస్ కేంద్ర మంత్రులకు వివరించారు. అదే విధంగా కొవ్వూరు- భద్రాచలం నూతన రైల్వే లైను నిర్మాణ ప్రాజెక్టు రాష్ట్ర విభజన అంశంలో ఉందని ఆప్రాజెక్టు అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్  పేర్కొన్నారు.
 
ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర టిఆర్అండ్బి,రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు కృష్ణ బాబు,వి.ఉషారాణి తోపాటు అర్జా శ్రీకాంత్, డా.చలపతి రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కదిరి -పులివెందుల సరిహద్దులో భారీ వర్షంతో తెగిన బ్రిడ్జి