Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగు చట్టాలపై సుప్రీంకోర్టుకు నివేదిక!

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (14:46 IST)
ఇటీవల కేంద్రం ప్రభుత్వం కొత్తగా మూడు సాగు చట్టాలను తీసుకొచ్చింది. ఇవి రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేలా ఉన్నాయని పేర్కొంటూ ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ ఆందోళన తీవ్రరూపందాల్చి.. ఏకంగా ఎర్రకోటపై దాడి జరిగింది. 
 
కేంద్ర చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ నాలుగు నెల‌లుగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వంతో ఎన్నో రౌండ్ల చ‌ర్చ‌లు జరిగినా అవి కొలిక్కి రాలేదు.
 
ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై గ‌త జ‌న‌వ‌రి 12న వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రెండు నెల‌ల పాటు అమ‌లును నిలిపేసి క‌మిటీని నియ‌మించిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. ఆలోపు నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. 
 
అదేసమయంలో ముగ్గురు స‌భ్యులతో ఓ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మొత్తం 85 రైతు సంఘాల‌తో తాము సంప్ర‌దింపులు జ‌రిపి ఒక నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. 
 
రైతు సంఘాల నేతలతో మాట్లాడిన త‌ర్వాత ఈ స‌మస్య‌కు ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నించిన‌ట్లు చెప్పింది. అయితే రిపోర్ట్‌లో ఏముందో మాత్రం బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు. దీనిపై ఏప్రిల్ 5న సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments