Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిది లైంగిక వేధింపులు... వదిన ఆత్మహత్య.. నోరు మెదపని భర్త

లైంగిక వేధింపులకు మరో వివాహం ఆత్మహత్య చేసుకుంది. పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లోగల మధుబన్ కాలనీలో 30 ఏళ్ల మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2017 (14:00 IST)
లైంగిక వేధింపులకు మరో వివాహం ఆత్మహత్య చేసుకుంది. పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లోగల మధుబన్ కాలనీలో 30 ఏళ్ల మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మరిది లైంగికంగా వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందనీ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. 
 
భార్య మృతిపై భర్త మాత్రం నోరు మెదపడం లేదు. భార్య మృతదేహం దగ్గర మౌనంగా కూర్చొండిపోయాడు. పోలీసులు అడిగే ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా జవాబు చెప్పేందుకు నిరాకరిస్తున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, కోడలి మృతిపై అత్త జస్బీర్‌కౌర్ మాట్లాడుతూ 'నేను వంట గదిలో ఉన్నాను. ఫ్యానుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి నా చిన్న కుమారుడు చూసి నాకు చెప్పాడు. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాన్ని కిందకుదించాం. అప్పటికే ఆమె చనిపోయింది. ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవు. అయితే నా కొడుకు, కోడలు మద్యానికి బానిసయ్యారు' అని చెప్పుకొచ్చారు. 
 
కాగా, మృతురాని నాలుగేళ్ల కొడుకు తల్లి దగ్గర కూర్చుని ఏడుస్తుండటం అందరినీ కంటతడిపెట్టించింది. ఈ కేసులో భర్తతో పాటు.. అత్త జస్బీర్ కౌర్, మరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం