దళిత మహిళ చీర లాగి.. రవిక చింపడం బాధించింది : పవన్ కళ్యాణ్
విశాఖపట్టణం జిల్లా పెందుర్తితో తన స్థలాన్ని కబ్జా చేయాలని భావించిన భూబకాసురలను అడ్డుకున్న ఓ దళిత మహిళను వివస్త్రను చేసి ఘటన రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది.
విశాఖపట్టణం జిల్లా పెందుర్తితో తన స్థలాన్ని కబ్జా చేయాలని భావించిన భూబకాసురలను అడ్డుకున్న ఓ దళిత మహిళను వివస్త్రను చేసి ఘటన రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా అధికార టీడీపీ నేతలేనని అంటున్నారు. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటను సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రజలు వివరణ కోరాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
అధికార తెలుగుదేశం పార్టీ నేతలే ఈ దారుణానికి ఒడిగట్టారని రిపోర్టులు చెబుతున్నాయన్నారు. ఈ ఘటన గురించి విన్న తర్వాత తాను చాలా బాధపడ్డానని తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టినవారిపై పోలీసులు, ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని... దీనివల్ల ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయని హెచ్చరించారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు కారంచేడు, చుండూరు ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
అదేసమయంలో సున్నితమైన అంశాలపై స్పందించేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహిరించాలని ఆయన కోరారు. లేకపోతే సామరస్యం దెబ్బతింటుందన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థి రోహిత్ వేముల మరణం దేశవ్యాప్తంగా ఎంతటి ఉద్రిక్తతను రేకెత్తించిందో ఆలోచించుకోవాలన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాననీ, అలాగే, వ్యక్తిగతంగా కొందరు చేసే పనులకు కులం రంగు పులుముతున్నారని... ఇది మంచి పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా కోరారు.