Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలి బొటనవేలితో నుదిటిపై తిలకం దిద్దిన యువతి..

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (11:26 IST)
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఓ యువతి తన కుడికాలి బొటన వేలితో ఆయన నుదిటిపై తిలకందిద్దారు. రాష్ట్రంలోని జలగావ్‌ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనకు ఓ యువతి తిలకందిద్దారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న సన్నివేశంతో ఆయన కళ్లు చెమర్చాయి. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'ఇప్పటివరకు ఎందరో తల్లులు, సోదరీమణుల నుంచి నేను ఆశీర్వాదం తీసుకున్నాను. తిలకం స్వీకరించాను. ఇప్పుడు కూడా నాకు తిలకం దిద్దేందుకు ఓ సోదరి బొటనవేలు నా నుదిటి మీదకు చేరింది. అయితే, అది చేతి వేలు కాదు.. కాలి బొటనవేలు. జీవితంలో ఎదురయ్యే ఇలాంటి క్షణాలు ఒక్కసారిగా ఉద్వేగానికి గురిచేస్తాయి. కళ్లు చెమర్చేలా చేస్తాయి. 
 
ఈ సోదరి నాకు తిలకం దిద్ది, అదే వేళ్లతో హారతి ఇచ్చింది. అప్పుడు ఆమె మొహంలో చిరునవ్వు, కళ్లల్లో ఒకరకమైన మెరుపు కనిపించింది. ‘నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే.. నాకు ఎవరి జాలి, దయ అవసరం లేదు. ఆ పరిస్థితులను దాటుకొని వెళ్తాను’ అని ఆ మెరుపును చూస్తే నాకనిపించింది' అని ఫడ్నవిస్ ట్వీట్‌ చేశారు. అలాగే ప్రతిపోరాటంలో ఆమెకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి సినిమాలో సోహైల్ ఖాన్ ఫస్ట్ లుక్

కేటీఆర్‌ను అరెస్టు చేస్తే ప్రభుత్వం ఆస్తుల ధ్వంసానికి కుట్ర : కాంగ్రెస్ (Video)

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments