Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

ఠాగూర్
శుక్రవారం, 2 మే 2025 (22:20 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణంలోనే యుద్ధ ఘంటికలు మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కొందరు యువకులు పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. ఇలాంటివారిని ఉద్దేశించి అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
భారత్‌లో ఉంటూ పాక్ అనుకూల నినాదాలు, పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసే వారి కాళ్లు విరగ్గొట్టాలని పిలుపునిచ్చారు. పహల్గాం ఉగ్రదాడిలో అమాయక ప్రజలను దారుణంగా హతమార్చిన తర్వాత కూడా భారత్‌లో పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. 
 
పహల్గాం దారుణోదంతం తర్వాత కూడా ఇక్కడ పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వారి కాళ్ళు విరగ్గొట్టాలి. రాష్ట్రంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన పలువురుని అరెస్టు చేశాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. అయినా కొంతమంది అకతాయిలు పాక్‌కు అనుకూల నినాదాలు చేయడం సహించజాలమన్నారు. 
 
ఇలాంటివారిని గుర్తించి, నిర్దాక్షిణ్యంగా వారి కాళ్లు విరగ్గొట్టి మరీ అరెస్టు చేసి జైల్లో వేయాలని పోలీసులకు ఈ సందర్భంగా సూచిస్తున్నా. ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడి అమాయక ప్రజలను చంపినా ఇక్కడి నుంచి పాక్‌కు మద్దతు తెలపడం దారుణం. మన దేశంలో నివసిస్తూ ఇక్కడి తిండి తింటూ పాక్‌కు మద్దతు తెలిపేవారు మాకు అవసరం లేదు. అలాంటి వారిని దేశం, రాష్ట్రం క్షమించదు. సహించదు అని సీఎం హిమంత అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments