Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్ - దివాళా తీయక తప్పదా?

Advertiesment
India vs Pakistan

ఠాగూర్

, శుక్రవారం, 2 మే 2025 (12:49 IST)
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ నుంచి అందుతున్న ఆర్థిక సహకారాన్ని నిరోధించే దిశగా భారత్ కీలక చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. పాకిస్థాన్‌పై రెండు విధాలుగా ఆర్థికపరమైన ఒత్తిడి తీసుకురాలని భారత్ యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 
 
మొదటి చర్యగా పాకిస్థాన్‌ను యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులోకి తిరిగి చేర్చేందుకు భారత్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టండలో విఫలమయ్యే దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేరుస్తుంది. గతంలో జాబితాలో ఉన్న పాకిస్థాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. 
 
రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇటీవల పాకిస్థాన్‌కు మంజూరు చేసిన 7 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయి ప్యాకేజీ వినియోగంపై భారత్‌ తన ఆందోళనలను వ్యక్తం చేయనున్నట్టు సమాచారం. ఈ నిధులను సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని భారత యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు ద్వారా తెలిపింది. 
 
ఈ ద్వంద వ్యూహం ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని, తద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పహల్గాం దాడి వంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసేందుకు ఈ ఆర్థికపరమైన ఒత్తిడిని ఒక మార్గంగా భారత్ పరిగణిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kolar farmers: పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతి నిలిపివేసిన వ్యాపారులు