Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో 2.47 లక్షల యేళ్ళ నాటి రాతి పనిముట్లు

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (09:48 IST)
ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2.47 లక్షల నాటి (రాతియుగం) రాతిపనిముట్లు బయటపడ్డాయి. 2018లో హనుమంతునిపాడు వద్ద సాగుతున్న పురావస్తు శాఖ తవ్వకాల్లో ఇవి వెలుగుచూశాయి. ఈ బయల్పడిన రాతి పనిముట్లను సైంటిఫిక్ డేటింగ్ ద్వారా పరిశోధన చేయగా, హోమోసెపియన్స్ కంటే ముందే ఆదిమానవులు ఉన్నారని, వారు వీటిని ఉపయోగించివుంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ప్రకాశం జిల్లాలోని కనిగిరి సమీపంలో ఉన్న పాలేరు నదీ తీరంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు గత 2018 నుంచి కొనసాగుతున్నాయి. వడోదరకు చెందిన మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న దేవర అనిల్ కుమార్ సారథ్యంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ పనిముట్లను అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్‌లో సైంటిఫిక్ డేటింగ్ విధానంలో పరిశీలించగా ఇవి 2.47 లక్షల యేళ్ళనాటివని నిపుణులు తేల్చారు. 
 
ఆధునిక మానవులు (హోమోసెపియన్స్) 1.22 లక్షల ఏళ్ళ కిందట ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చారని, వారు తమతోపాటు రాతిపనిముట్లు తెచ్చారన్నది ఇప్పటివరకు ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్న సిద్ధాంతం. అయితే, అంతకుముందే ఇక్కడ ఆది మానవులు సంచారించాన్నదానికి ప్రకాశం జిల్లాలో లభ్యమైన లక్షల ఏళ్ళనాటి రాతిపనిముట్లే నిదర్శనమని, వాటిని హోమో ఎరక్టస్ జాతి ఆది మానవులు వినియోగించివుంటారని భావిస్తున్నారు. తద్వారా హోమోసెపియన్స్ సిద్ధాంతం తెరమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments