Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీరు కార్చడం కాదు.. బాధితులకు శాశ్వత పరిష్కారం కావాలి.. సోనూసూద్

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (06:22 IST)
ఒడిశా రైలు ప్రమాదంపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కరోనా ఆపద్భాంధవుడు, సినీ నటుడు సోనూసూద్ స్పందించారు. ఒడిశా రైలు ప్రమాద ఘటన హృదయ విదారకమైన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఒడిశా రైలు ప్రమాద ఘటన హృదయ విదారకమైనదని సోనూ అన్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంతాపం తెలపడంతో పాటు వీడియో సందేశాన్ని ఇచ్చారు. ప్రజలు కేవలం సోషల్ మీడియాలో కన్నీరు కార్చినంత మాత్రాన ఏమీ లాభం లేదని, సాధ్యమైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు శాశ్వత పరిష్కారం కావాలన్న సోనుసూద్ అన్నారు. ఈ ఘటన పట్ల ప్రభుత్వం స్పందించిన తీరుపై సోనూసూద్ అభినందించారు. 
 
ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు జీవితకాలం పెన్షన్లు లేదా స్థిరమైన నెలవారీ వేతనం చెల్లించాలని సోను సూద్ డిమాండ్ చేశారు. బాధితులకు కంటితుడుపు సహాయం కాకుండా శాశ్వత పరిహారం ఉండేలా చూడాలన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments