Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1995కి తర్వాత 21వ శతాబ్దంలో అతిపెద్ద రైలు ప్రమాదం.. 300 మంది మృతి

Advertiesment
Train
, శనివారం, 3 జూన్ 2023 (17:25 IST)
Train
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 300 మంది మృతి చెందారు. భారతదేశంలో జరిగిన రైలు ప్రమాదాల చరిత్రలో ఒడిశా రైలు ప్రమాదం మూడో అతిపెద్దది. 1995 నుండి అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా ఒడిశా రైలు ప్రమాదం నిలిచింది.
 
అంతకుముందు 1981లో బీహార్‌లోని భాగమతి ప్రమాదంలో 750 మందికి పైగా, 1995లో యూపీలోని ఫిరోజాబాద్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 310 మంది మృతి చెందారు. 
 
ఇకపోతే.. ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకున్న ఘటన స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు.
 
21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదం ఇదని.. ఈ ఘటనపై కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైల్వేలో సమన్వయ లోపం, గ్యాప్ కనిపిస్తోంది. వీళ్లకు బడ్జెట్ కూడా ఉండదు అంటూ విమర్శించారు. 
 
రైలులో యాంటీ కొలిజన్ పరికరం లేదు. ఆ పరికరం రైలులో ఉండి ఉంటే.. ఈ ఘోరం జరిగేది కాదన్నారు. మృతుల కుటుంబాలకు రైల్వే పరిహారంగా రూ.10 లక్షలు అందజేస్తుందని ప్రకటించారు. 
 
తాము తమ రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని మమత ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున అందజేస్తామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ్యాపీ బర్త్ డే బావ: కవిత గ్రీటింగ్స్.. ఫోటో వైరల్