Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లిని పదేళ్లుగా హింసించాడు.. వారానికోసారి బిస్కెట్లు తెచ్చి..?

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (12:29 IST)
కంటిపాపలా చూసుకోవాల్సిన కన్నతల్లిని పదేళ్లుగా హింసించాడు. ఇంట్లో పెట్టి తాళాలు వేసి బిస్కెట్లు ఆకలికి విసిరేసి దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా కావేరినగర్‌కు చెందిన జ్ఞానజ్యోతి (62)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు షణ్ముగసుందరన్‌ చెన్నైలో ఇన్‌స్పెక్టర్‌. చిన్న కుమారుడు వెంకటేశన్‌ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. 
 
పదేళ్ల కిందటే జ్ఞానజ్యోతి భర్త, కుమార్తె మృతి చెందారు. ఆస్తుల కోసం అన్నాదమ్ములు విడిపోయారు. ఇందులో భాగంగా తల్లిని పట్టించుకోలేదు. పదేళ్ల క్రితం ఓ ఇంట్లో బంధించారు. 
 
వారానికోసారి వచ్చి బిస్కెట్లు తెచ్చి గేట్‌లోంచి లోపలికి విసిరేసి వెళ్లేవారు. ఆమె పరిస్థితి చూసి స్థానికులే ఆహారం పెట్టేవారు. సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు ఆమెను కాపాడటం జరిగింది. 
 
ప్రస్తుతం ఆమె మానసికస్థితి సరిగా లేదు. చికిత్స కోసం తంజావూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షణ్ముగసుందరన్‌, వెంకటేశన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments