Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా ముందు నువ్వు త‌గ్గాలి- చిరంజీవి, త‌గ్గ‌ను అంటున్న చ‌ర‌ణ్‌

Advertiesment
charan-chiru dance
, శనివారం, 16 ఏప్రియల్ 2022 (16:43 IST)
charan-chiru dance
ఏం చ‌ర‌ణ్ న‌న్ను డామినేట్ చేస్తావా! నేను నీ బాబున్రా, త‌గ్గాలి అంటూ చిరంజీవి అంటే, నేను త‌గ్గ‌ను అని చ‌ర‌ణ్ స‌మాధాన‌మిచ్చాడు. త‌గ్గాలిరా.. అని మ‌ర‌లా అంటే.. నేను మీ ద‌గ్గ‌ర ట్రైనింగ్ నుంచి వ‌చ్చాను.  త‌గ్గితే బాగోదు డాడీ అని చెప్ప‌డంతో.. వెంట‌నే రేపు కెమెరాముందు చూసుకుందాం.. అంటూ ఛాలెంజ్‌గా త‌న కొడుకుతో స‌ర‌దాగా సాగిన సంభాష‌ణ వీడియో చిత్ర‌ యూనిట్‌ బ‌య‌ట‌కు విడుద‌ల‌ చేసింది 
 
కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆచార్య సినిమాలో తండ్రీ కొడుకులు క‌లిసి న‌టిస్టున్నారు. ఇందులో భ‌లే భ‌లే బంజారా.. అనే పాట‌ను ఇద్ద‌రిపై షూట్ చేసేముందు ద‌ర్శ‌కుడు సాంగ్‌ను చిరంజీవికి వినిపించారు. అనంత‌రం చిరంజీవి కాస్త భ‌యాన్ని న‌టిస్తూ, నేను ఈ పాట‌కు డాన్స్ చ‌ర‌ణ్‌తో ఎలా చేయాలా! అనే ఆలోచిస్తున్నా. నాటునాటు.. అనే పాట చూశాక‌..తార‌క్‌. నువ్వు ఇర‌గొట్టారు. అందుకే నాకు ఎక్క‌డో డౌట్ వ‌స్తుంది అని చెప్పారు.


ఇక కొర‌టాల మాట్లాడుతూ, లైవ్‌లో మీ ఇద్ద‌రి డాన్స్ చూడాల‌నేది నా ఆలోచ‌న‌. అందుకే శేఖ‌ర్ మాస్ట‌ర్ ఆద్వ‌ర్యంలో షూట్ చేయాల‌ని అనుకుంటున్నాను అని చెప్పారు. ఆ వెంట‌నే చిరంజీవి.. జ‌న‌ర‌ల్‌గా సురేఖ షూట్‌కు రాదు. మొద‌టిసారి మేం ఇద్ద‌రి డాన్స్ చేస్తే చూడాల‌నుంద‌ని చెప్పింది. మ‌రి రేపు ఎదురుగా కుర్రాల్ళు, లైవ్‌లో అంద‌రూ చూస్తుండ‌గా చేయాలంటే కాస్త బెరుకుగా వుందంటూ..సెటైర్ వేశారు. 
 
ఈ బంజారా సాంగ్ ఈనెల 18న బ‌య‌ట‌కు విడుద‌ల‌చేస్తుంది చిత్ర‌యూనిట్‌. ఈ సంద‌ర్భంగా చిరంజీవి, కొర‌టాల‌, రామ్‌చ‌ర‌ణ్‌ల మ‌ధ్య సంభాష‌ణ వీడియోను విడుద‌ల చేశారు. మ‌రి 18న విడుద‌ల‌కాబోయే సాంగ్ తండ్రీకొడుకుల స్టెప్స్ కోసం ఫ్యాన్ ఎదురుచూస్తున్నారు.
 
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సోనూ సూద్, జిష్పూ సేన్ గుప్తా, వెన్నెల కిశోర్, సౌరవ్ లోకేశ్, కిశోర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, అజయ్, సంగీత, రెజీనా, నాజర్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న జనం ముందుకు రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంట‌త‌డి పెట్టించిన‌ పూనమ్ పాండే నెట్టింట్లో వైర‌ల్‌!