Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య పన్ను ఊడిపోయింది.. వాట్సాప్‌లో పెడతానన్నాడు

సోషల్ మీడియా ప్రస్తుతం అన్నీ వర్గాల వారిని ప్రభావితం చేస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఓ స్కిన్ స్పెషలిస్ట్ భార్

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (11:02 IST)
సోషల్ మీడియా ప్రస్తుతం అన్నీ వర్గాల వారిని ప్రభావితం చేస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఓ స్కిన్ స్పెషలిస్ట్ భార్యను ఆటపట్టించాడు. తన భార్య దంతాలు ఊడిపోయాయని.. నా భార్య ముసలిదైపోయిందని.. పళ్లు ఊడిపోయాయని కామెంట్ చేసి వాట్సాప్‌లో పెట్టేస్తానని చెప్పాడు. అంతే స్కిన్ స్పెషలిస్ట్ భార్య విషం తాగేసింది. ఈ ఘటనలో స్కిన్ స్పెషలిస్ట్ భార్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌కు చెందిన డాక్టర్ నళిన్ పాట్నీ స్కిన్ స్పెషలిస్ట్. అతని భార్య సోనాకు దంత సమస్య కారణంగా.. దానిని తొలగించి కొత్తది అమర్చారు. పన్ను పాడు కావడంతో కొత్త పన్ను పెట్టిన విషయంపై భార్య సోనాను నళిన్ ఆటపట్టించడం మొదలుపెట్టాడు. 
 
పన్ను తొలగించిన ఫోటోను వాట్సాప్‌లో పెడతానని.. క్యాప్షన్ కూడా నా భార్య ముసలిదైపోయిందని.. పళ్లు ఊడిపోయానని రాస్తానని సరాదా చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన సోనా గదిలోకి వెళ్లి కాసేపటికి తర్వాత బయటికి వచ్చి విషం తాగానని చెప్పాడు. దీంతో షాక్ అయిన నళిన్ ఆస్పత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ సోనా మరణించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments