Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యతో పలుకుతున్నాడనీ నగ్నంగా చెట్టుకు కట్టేసి చనిపోయేదాకా కొట్టారు...

కర్ణాటక రాష్ట్రంలోని యద్గిరి జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ యువకుడు తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ ఓ యువకుడిని నగ్నంగా చేసి చెట్టుకు కట్టేసి ప్రాణంపోయేంతవరకు కొట్టి చంపాడో భర్త. అంతేనా, కట్

Advertiesment
భార్యతో పలుకుతున్నాడనీ నగ్నంగా చెట్టుకు కట్టేసి చనిపోయేదాకా కొట్టారు...
, శనివారం, 25 నవంబరు 2017 (14:23 IST)
కర్ణాటక రాష్ట్రంలోని యద్గిరి జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ యువకుడు తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ ఓ యువకుడిని నగ్నంగా చేసి చెట్టుకు కట్టేసి ప్రాణంపోయేంతవరకు కొట్టి చంపాడో భర్త. అంతేనా, కట్టుకున్న భార్యను కూడా వివస్త్రను చేసి చితకబాదాడు. ఈ దారుణాన్ని ఊరువాడా చూస్తూ నిల్చొండిపోయారేగానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకోకపోగా, కనీసం పోలీసులకు కూడా సమాచారం చేరవేయలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటకలోని యద్గిరి జిల్లాకు చెందిన ఓ నిర్మల అనే వివాహిత అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త వారిద్దరినీ మందలిచాడు. అయినప్పటికీ వారిద్దరిలో ఎలాంటి మార్పురాలేదు కదా రోజులు గడిచేకొద్దీ మరింత విచ్చలవిడిగా ప్రవర్తించసాగారు. 
 
ఈ క్రమంలో వారిద్దరూ కలిసి ఉన్న దృశ్యం కనిపించడంతో భర్తకు ఆగ్రహంతో రగిలిపోయాడు. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టాడు. ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసి.. చెట్టుకు కట్టేసి భర్త, అతని స్నేహితులు యువకుడిపై దాడికి పాల్పడ్డారు. 
 
అలాగే, భార్యను కూడా వివస్త్రను చేసి చితక్కొట్టారు. దీంతో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. భార్య, ఆమె ప్రియుడిపై దాడి చేసిన తర్వాత భర్త తప్పించుకుని పారిపోయాడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని భార్యకు, ఆ యువకుడికి మధ్య కొన్ని నెలలుగా వ్యవహారం నడుస్తుందని తెలిసింది.
 
అయితే ఈ ఘటన జరిగిన సమయంలో స్థానికులెవరూ ఎందుకు అడ్డుకోలేదనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్‌లో వైరల్‌గా మారాయి. ఫొటోలు చూసిన నెటిజన్లు షాక్‌కు లోనయ్యారు. ఈ ఘటనపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హఫీజ్‌ విడుదలపై అమెరికా ఆందోళన... పాక్‌కు వార్నింగ్