సార్, ఇక్కడ పవర్ కట్, నెట్ లేదు: WFH ఉద్యోగి నాటకాలు, పీకేయండంటూ కామెంట్స్

ఐవీఆర్
శనివారం, 13 డిశెంబరు 2025 (20:57 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
WFH... వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొంతమంది ఉద్యోగులు చిత్తశుద్ధితో చేస్తుంటే మరికొందరు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇటువంటివారి వల్ల పూర్తిస్థాయిలో పనిచేసేవారి పట్ల కూడా వ్యతిరేక భావన కలుగుతోంది. తాజాగా ఓ కంపెనీ మేనేజరుకి తన కింద పనిచేసే ఉద్యోగి చుక్కలు చూపించాడు.
 
వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసాడు. భార్యతో హాయిగా డెహ్రడూన్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ... సరైన సమయానికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా తాత్సారం చేసాడు. అదేమని అడిగితే... సార్, ఇక్కడ పవర్ కట్, నెట్ పని చేయడంలేదు అంటూ రోజుకో మాట చెప్పి విసిగించాడు. ఈ విషయాన్ని సదరు మేనేజర్ తన టీమ్ సభ్యుడితో ఎదురవుతున్న పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతే... నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.
 
ఒకరు స్పందిస్తూ.. ఇలాంటివాడిని ఎందుకు బాస్ టాల్రేట్ చేస్తారు, పీకిపారేయండి. ఇతడిని వదిలిస్తే మిగిలినవారు కూడా అలాగే మారతారు అంటూ కామెంట్ పోస్ట్ చేసాడు. మరొకతను, నేను ఉండేది డెహ్రడూన్ లోనే. ఇక్కడ పవర్ కట్స్ అస్సలు వుండవు. ఎపుడైనా కరెంట్ పోతే 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇక నెట్ సౌకర్యం అద్భుతంగా వుంటుంది. నాకు తెలిసి, నీ దగ్గర పనిచేసే సదరు ఉద్యోగి తన భార్యను తీసుకుని జాలీగా ట్రెక్కింగుకి వెళ్లి వుంటాడు అంటూ పోస్ట్ పెట్టాడు. ఇలా ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగి చెప్పిన కారణంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఈ వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. కాగా సదరు కంపెనీ ఎక్కడిది, ఉద్యోగి ఎవరు అనే వివరాలు మాత్రం తెలుపలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments