Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌పై పేలుడు పదార్థాలు ప్రయోగిస్తే సర్జికల్ స్ట్రైక్స్‌పై సందేహాలురావు...

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (15:41 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ మహిళా నేత పంకజ్ ముండే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, భారత సైనికులపై దాడి చేసిన ఉగ్రవాదులపై సర్జికల్ దాడులు జరిపామన్నారు. కానీ, కొందరు "అసలు దాడులు ఎక్కడ జరిపారు.. ఆధారాలేవ"ని ప్రశ్నిస్తున్నారు. వారికి అర్థమవ్వాలంటే ఒకటే దారి.. రాహుల్‌ గాంధీ మెడలో బాంబు కట్టి.. వేరే దేశానికి పంపించాలి' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంకజ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమెపై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.
 
అంతేకాకుండా, రాహుల్‌ గాంధీపై పేలుడు పదార్థాలు ప్రయోగిస్తే.. సర్జికల్‌ స్ట్రైక్స్ గురించి అనుమానం వ్యక్తం చేసేవారు నోరు ముస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్నా లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించారు. రాహుల్‌ మెడకు బాంబులు కట్టాలన్న వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments