శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో 140 మంది వరకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. ఈస్టర్ సండేను పురస్కరించుకుని ప్రార్థనల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీరిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.
ఈ పేలుళ్ళు కొలంబోలోని సెయింట్ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా హోటల్, సిన్నామన్ గ్రాండ్ హోటల్, కింగ్స్‌బరి హోటళ్లలో సంభవించాయి. ఉగ్రదాడిపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం కొలంబోలో హై అలర్ట్ ప్రకటించారు. ఈస్టర్ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు.
కొలంబోలోని సిన్నామన్ గ్రాండ్ హోటల్‌లో బస చేసిన రాధికా ఈ ఘటన జరిగే కొద్దీ నిమిషాల ముందు ఈ హెటల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారట. దాంతో ఆమె పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన తనకి షాకింగ్‌గా ఉందని, ఇప్పటికి నమ్మలేకపోతున్నానంటూ రాధిక తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.