Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో తెగదెంపులు.. 2019లో ఒంటరిగానే : శివసేన

మహారాష్ట్రలో బీజేపీ - శివసేన పార్టీల మధ్య ఉన్న స్నేహబంధం తెగిపోయింది. వచ్చే యేడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు శివసేన అధినేత రాజ్‌థాక్రే ప్రకటించారు.

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (14:33 IST)
మహారాష్ట్రలో బీజేపీ - శివసేన పార్టీల మధ్య ఉన్న స్నేహబంధం తెగిపోయింది. వచ్చే యేడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. 1990ల నుంచే భాజపా - శివసేన మధ్య పొత్తు కుదిరింది. ఈనేపథ్యంలో ఇపుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే తాము పోటీ చేయనున్నట్లు శివసేన తెలిపింది. 
 
మంగళవారం జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయిస్తూ కార్యవర్గ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. 
 
కాగా, 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనను కాదని ఒంటరిగా పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ శివసేనతో చేతులు కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ చతికిలపడగా, విపక్ష పార్టీలు పుంజుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments