Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌కి వెళ్లిన శివసేన ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి

Webdunia
గురువారం, 12 మే 2022 (17:21 IST)
MLA
కుటుంబంతో విహార యాత్ర కోసం దుబాయ్‌కి వెళ్లిన ముంబైకి చెందిన ఓ శివసేన ఎమ్మెల్యే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ పర్యటనకు వెళ్లిన శివసేన ఎమ్మెల్యే రమేశ్ లక్టే అక్కడ గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది.
 
ఆయన వయసు 52 ఏళ్లు. ఎమ్మెల్యే రమేశ్ భౌతికదేహాన్ని గురువారం ముంబై తీసుకొచ్చే అవకాశం ఉంది. కాగా.. ముంబైలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే కావడానికి ముందు ఆయన బీఎంసీ కార్పొరేటర్‌గా కూడా చేశారు. 
 
కాంగ్రెస్‌కు చెందిన సురేష్ శెట్టిని ఓడించి, 2014లో అంధేరీ ఈస్ట్ నుంచి మహారాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 2019లో స్వతంత్ర అభ్యర్థి ఎం పటేల్‌ను ఓడించారు. కాగా, ఎమ్మెల్యే రమేశ్ మృతి పట్ల శివసేన నేతలు నివాళి అర్పించారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments