గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కోర్టులో ఊరట లభించింది. 2017లో రాజధాని పరిధిలో పెనుమాకలో జరిగిన గొడవకు సంబంధించి సీఆర్డీఏ అధికారులపై దాడి చేశారంటూ నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. ఈ కేసును విచారించిన విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
రాజధాని భూసేకరణకు వచ్చిన అధికారులపై వైకాపా నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాడి చేశారని, వారి విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ అపుడు కేసు నమోదైంది. నాటి ఘటనలో సీఆర్డీఏ అధికారుల ఫిర్యాదు మేరకు ఆర్కేతో పాటు మొత్తం 11 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును కొట్టివేసింది.