Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైసీపీకి అసంతృప్తి సెగ.. మంటల్లో దూకేందుకు రెడీ అయిన మహిళ

fire
, సోమవారం, 11 ఏప్రియల్ 2022 (12:03 IST)
వైసీపీకి అసంతృప్తి సెగ తప్పలేదు. తమ తమ ప్రియతమ నేతలకు కేబినెట్ బెర్తు దక్కకపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. కొన్ని జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. గుంటూరు జిల్లాలో ఓ మహిళా కార్యకర్త మంటల్లోకి దూకుతానంటూ వీరంగం వేయడం సంచలనం రేపింది..
 
వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత తొలిసారి పార్టీలోనే సీఎం జగన్ నిర్ణయాలపై వ్యతిరేకత బాహాటంగా వ్యక్తమైంది. కొత్త మంత్రివర్గ కూర్పుపై పలు జిల్లాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేబినెట్‌లో బెర్తు దక్కని ఎమ్మెల్యేల అనుచరులు రోడ్లపైకొచ్చి నిరసనలు చేశారు. 
 
పలు చోట్ల టైర్లను తగులబెట్టి జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రకటనలు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు రాస్తారోకోలు చేశారు.
 
పల్నాడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి. రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనగా మండల కేంద్రమైన రెంటచింతల‌లో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా రోడ్డుపై టైయర్లు తగలపెట్టారు. ఈ రాస్తారోకో నిరసన కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం మహిళ నాయకురాలు పాముల సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే తేరుకున్న వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుచరులతో బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక భేటీ - ఎమ్మెల్యే పదవికి రిజైన్?