ఏపీ సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై కర్నూలు, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు.
మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో గురువారం నిర్వహించిన వాలంటీర్ సత్కారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎవరూ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు రావడం మానేశారని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలకు లేని పవర్ సీఎం జగన్ వాలంటీర్లకు ఇచ్చారని మండిపడ్డారు. చివరకు ఎమ్మెల్యే వద్దకు కూడా ప్రజలు రావడం లేదని చెప్పుకొచ్చారు.
రాబోయే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులనే బూత్ అధికారులుగా నియమిస్తారంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.