తమిళనాడులోని వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (డీఎస్ఎస్‌సి)లో డైరక్టింగ్ సాఫ్ట్ గ్రూప్ కెప్టెన్, శౌర్య చక్ర అవార్డు గ్రహీత వరుణ్ సింగ్ 48 గంటల తీవ్ర చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డారు.
బుధవారం కూనూర్ సమీపంలో జరిగిన మి-17వి5 హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి ఇతనేనని తమిళనాడు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో వరుణ్ సింగ్‌ను తీవ్ర చికిత్స అనంతరం వైద్యులు రక్షించారని తెలిపారు.
వరుణ్ సింగ్ ఇటీవల వింగ్ కమాండర్ నుండి గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి పొందారు. ఇటీవల డిఎస్‌ఎస్‌సిలో చేరాడు. ఇక విమాన ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, ఇతర అధికారులు సహా మిగిలిన 13 మంది మరణించిన సంగతి తెలిసిందే.