Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ‌ల ముఠా ప్ర‌వేశించింది... త‌స్మాత్ జాగ్ర‌త్త‌! కృష్ణా పోలీస్ విజ్ఞప్తి

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (10:33 IST)
యావన్మంది ప్రజానీకానికి కృష్ణా జిల్లా పోలీసు వారు ఇలా బ‌హిరంగ విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి వేళ ఇళ్లల్లోకి చొరబడి హత్యలు చేసి, దోపిడీలకు పాల్పడుతున్నముఠా రాష్ట్రంలోకి ప్రవేశించింద‌ని నందిగామ పోలీస్ స్టేషన్ సి.ఐ. కనకారావు తెలిపారు. కాబ‌ట్టి కృష్ణా జిల్లాలోని ప్రజలందరూ పగటి పూట, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాల‌ని బ‌హింరంగ హెచ్చ‌రిక‌లు చేశారు.
 
 
మీ నివాస ప్రాంతాలలో అపరిచిత వ్యక్తులు అనిపించినా, అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే మీ స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్ కుగాని, డయల్ 100 కు లేదా దిశా ఎస్. ఓ.ఎస్. ద్వారా తెలియజేయాల‌ని కోరారు. అలాగే, యువకులు మీమీ ప్రాంతాలలో రాత్రి పూటలు గస్తీ నిర్వహించవలసిందిగా కోరారు. 
 
 
మరీ ముఖ్యంగా మీ ప్రాంతాలలో ఎవరైనా సుదూర ప్రాంతాల నుండి అద్దెకు వచ్చిన కొత్త వ్యక్తులు లేదా మీ గ్రామ శివారు ప్రాంతాలలో గుడారాలు, గుడిసెలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారి గురించి వెంటనే పోలీసువారికి సమాచారం తెలియజేయాలి. అదే విధంగా మీరు మీ ఇంటికి తాళం వేసి వేరే ఊర్లకు వెళ్లితే, పోలీసువారికి సమాచారం ఇవ్వాలి. దీనితో పోలీసు వారు మీ ఇంటికి మరింత భద్రత పెంచే అవకాశం ఉంది.


గ్రామ శివారు ప్రాంతాలలో, వెంచర్లలో అపార్ట్మెంట్లలో నివసించే వారు రాత్రి పూటల ఎవరైనా తలుపులు తట్టినా, లేదా వివిధ రకాలైన పిల్లల ఏడుపుల శబ్దాలు చేసినా తలుపులు తీయకుండా, ఇంటి లోపల నుండే సదరు వ్యక్తుల వివరాలు తెలుసుకోవాలి. అనుమానాస్పదంగా అనిపించినా, లేదా కనిపించినా వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాల‌ని నందిగామ పోలీసులు విజ్న‌ప్తి చేశారు. సి.ఐ. క‌న‌కారావు, త‌న ఫోన్ నంబ‌ర్ ఫోన్. 8332983808 కూడా ప్ర‌జ‌ల‌కు కాల్ చేయ‌డానికి ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments