Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పేరులోనే ''చిల్'' ఉంది.. శశి ట్వీట్‌కు మానుషి కౌంటర్

"మిస్ వరల్డ్ 2017".. మానుషి చిల్లార్. 17 యేళ్ల క్రితం సుస్మితా సేన్ ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత ఎవరూ కూడా ఈ పోటీల్లో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. కానీ, మానుషి చిల్లార్ మాత్రం ఏకంగా మిస్ వరల్డ

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (09:58 IST)
"మిస్ వరల్డ్ 2017".. మానుషి చిల్లార్. 17 యేళ్ల క్రితం సుస్మితా సేన్ ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత ఎవరూ కూడా ఈ పోటీల్లో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. కానీ, మానుషి చిల్లార్ మాత్రం ఏకంగా మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని సొంతం చేసుకుంది. 
 
అయితే, పెద్ద నోట్ల రద్దుకు, మానుషి చిల్లార్‌కు లంకెపెడుతూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఓ ట్వీట్ చేశారు. మానుషి చిల్లార్‌ను చిల్లరతో పోల్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. అందులో "పెద్ద నోట్లను రద్దుచేసి ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో ఇప్పటికైనా గుర్తెరిగితే మంచిది. మన ‘చిల్లర’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ‘చిల్లర్’ ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతో రుజువైంది" అని మానుషి చిల్లార్‌ను చిల్లరగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. జాతీయ మహిళా కమిషన్ సైతం శశిథరూర్‌కు సమన్లు జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో శశిథరూర్ ట్వీట్‌పై మానుషి కూడా స్పందించారు. తన పేరులోనే చిల్ ఉందన్న విషయం మరిచిపోవద్దంటూ కౌంటర్ ఇచ్చారు. తనపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలతో కలత చెందడం లేదని సోమవారం ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ప్రపంచాన్ని గెలుచుకున్న ఒక అమ్మాయి ఇటువంటి వ్యాఖ్యలకు కలత చెందదు. చిల్లార్‌పై ఈ చర్చ చిన్న మార్పు మాత్రమే. చిల్లార్‌లోనే చిల్ ఉన్నదన్న విషయం మరిచిపోవద్దని ఆమె వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments