Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడి ధర తగ్గితే గుడ్డు ధర కొండెక్కి కూర్చుంది..

కోడి ధర తగ్గితే.. గుడ్డు ధర కొండెక్కింది. నెలలోనే కోడిగుడ్డు ధర 40 శాతం పెరిగితే.. చికెన్ ధర 30శాతం తగ్గింది. కార్తీక మాసం కావడంతో అయ్యప్ప, భవానీ దీక్షల కారణంగా మాంసాహారానికి చాలామంది దూరంగా వున్నారు.

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (09:33 IST)
కోడి ధర తగ్గితే.. గుడ్డు ధర కొండెక్కింది. నెలలోనే కోడిగుడ్డు ధర 40 శాతం పెరిగితే.. చికెన్ ధర 30శాతం తగ్గింది. కార్తీక మాసం కావడంతో అయ్యప్ప, భవానీ దీక్షల కారణంగా మాంసాహారానికి చాలామంది దూరంగా వున్నారు. దీంతో చికెన్ ధర దిగొచ్చింది. అయితే కోడిగుడ్డు ధర మాత్రం పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయితే.. కేజీ చికెన్ 150 రూపాయలు పలుకుతుండగా, కోడుగుడ్డు ధర 40 శాతం పెరిగి 7 రూపాయల నుంచి 7:50 పైసలుకు చేరిందని భారత పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు రమేశ్‌ కత్రి తెలిపారు.
 
కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడంతో సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడమే గుడ్డు ధర పెరగడానికి కారణమని రమేశ్ కత్రి వెల్లడించారు. కొన్ని నెలల పాటు పెరిగిన కోడిగుడ్ల ధరలతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని కత్రి చెప్పారు. నష్టభయంతో రైతులు గుడ్ల ఉత్పత్తి తగ్గించారని, దీంతో 25 నుంచి 30 శాతం గుడ్ల ఉత్పత్తి తగ్గిందని, దీంతో గుడ్ల ధరలు పెరిగాయని ఆయన వెల్లడించారు. అయితే కోడి మాంసం ధర కిందికి దిగింది. తిరుపతిలో కేజీ చికెన్ ధర వంద రూపాయలు కాగా, కోడి గుడ్డు ధర ఆకాశాన్నంటుతోంది. పేదవాడి పౌష్ఠికాహారంగా పేరొందిన కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments