జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (11:24 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని జైళ్ళను పేల్చేవేసేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారు. జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనాయుకులను విడిపించేందుకు వీలుగా ఈ భారీ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌ సెంట్రల్ జైలు, కోట్ బాల్వాల్ జైలు, జమ్మూలోని జైళ్లకు భారీ ఎత్తు భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి కేసులో అనేక మంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి జైళ్లలో బంధించారు. వీరితో పాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది.
 
ఈ నేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది. దీంతో ఆయా కారాగాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లుచేశారు. ఇప్పటికే సీఐఎస్ఎఫ్ డీజీ శ్రీనగర్‌లో ఉన్నతాధికారులతో ఈ అంశంపై భేటీ అయినట్టు సమాచారం. 2023 నుంచి జమ్మూకాశ్మీరులో జైళ్ల భద్రత ఈ దళం ఆధీనంలో ఉన్న విషయం తెల్సిందే. మరోవైపు, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ సెక్టార్‌లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదస్థావరాన్ని గుర్తించాయి. దీనిలో కమ్యూనికేషన్ పరికరాలు, ఐదు ఈఐడీలు లభ్యమయ్యాయి. ఈ స్థావరం సురాన్ కోట్ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments