Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. శానిటైజర్‌ను ఆల్కహాల్ అని తాగేశాడు.. చివరికి?

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (11:37 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో హ్యాండ్ వాష్ కోసం శానిటైజర్లు వాడుతున్నారు. ఇలా జైలు ఖైదీల కోసం కూడా శానిటైజర్లు అందుబాటులో వుంచారు. అదే ఓ ఖైదీ ప్రాణాలు తీసింది. 
 
జైల్లోని ఖైదీలకు కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా శానిటైజర్‌లను అందుబాటులో ఉంచగా, మందు వాసన రావడంతో, దాన్ని ఆబగా తాగేసిన ఓ రిమాండ్ ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రామన్ కుట్టీ అనే ఓ ఖైదీ, శానిటైజర్‌ను తాగి అపస్మారక స్థితికి వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు. కాగా శానిటైజర్‌ను ప్రభుత్వ ఆదేశానుసారం జైలులోనే ఖైదీలు తయారు చేశారు. 
 
మంగళవారం రాత్రి వరకూ బాగానే ఉన్న అతను, బుధవారం జైలు గదిలోనే కుప్ప కూలాడని, ఆపై హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments