Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకారణంగా లాఠీలకు పనిచెప్తే సస్పెండ్ చేస్తాం : ఏపీ డీజీపీ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (11:26 IST)
లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సరకుల కోసం గృహాల నుంచి బయటకు వచ్చే వారిపై అకారణంగా లాఠీ ఝుళిపించే పోలీసులకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ గౌతం సవాంగ్ తీవ్ర హెచ్చరిక చేశారు. లాక్‌డౌన్ సందర్భంగా ఎవరైనా ఇళ్ళ నుంచి బయటకు వస్తే ముందుగా వారిని హెచ్చరించాలనీ, అప్పటికీ మాట వినకపోతే లాఠీలకు పని చెప్పాలని సూచించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 
 
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పెరవలి గ్రామానికి చెందిన ఓ యువకుడిపై స్థానిక ఎస్ఐ అతిగా ప్రవర్తించాడు. ఇంటి నుంచి బయటకు వచ్చాడన్న కోపంతో విచక్షణారహితంగా చితకబాదాడు. త‌ప్ప‌యింద‌ని బ‌తిమాల‌డానికి వ‌చ్చిన అత‌ని తండ్రిని కూడా తీవ్రంగా కొట్టాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ విషయం డీజీపీ గౌతం సవాంగ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. 
 
యువ‌కుడిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసిన పెరవలి ఎస్ఐ కిరమణ్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. లాక్‌డౌన్ సంద‌ర్భంగా ఎవ‌రైనా ఇళ్ళ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే ముందుగా హెచ్చ‌రించాల‌ని, అయినా మాట విన‌క‌పోతే అప్పుడు లాఠీచార్జి చేయాల‌ని డీజీపీ సూచించారు. అత్య‌వ‌స‌రాల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చేవారిని ఇబ్బంది పెట్టొద్ద‌ని చెప్పారు. బ‌య‌ట ఎవ‌రు క‌న‌ప‌డినా అకార‌ణంగా లాఠీల‌కు ప‌నిచెప్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని పోలీసులకు హెచ్చ‌రిక చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా?

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments