Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసియా క్రికెట్ టోర్నీకి "కరోనా" గండం?

ఆసియా క్రికెట్ టోర్నీకి
, గురువారం, 26 మార్చి 2020 (19:15 IST)
ప్రతి యేడాది ఆసియా దేశాల మధ్య క్రికెట్ టోర్నీ జరుగుతుంది. కానీ, ఈ యేడాది ఈ క్రికెట్ టోర్నీకి కరోనా వైరస్ గండం పట్టుకుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో టోక్యో వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్ పోటీలు సైతం వాయిదాపడ్డాయి. అలాగే అనేక అంతర్జాతీయ క్రీడా సంగ్రామాలు కూడా వాయిదా వేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ టోర్నీ నిర్వహణ కూడా ఇపుడు సందిగ్ధంలో పడింది. కొవిడ్ -19తో ఈ యేడాది జ‌రిగే ఆసియాక‌ప్ టోర్నీ ఆతిథ్యంపై తుది నిర్ణ‌యం తీసుకోకుండానే క్రికెట్ కౌన్సిల్‌(ఏసీసీ) త‌మ స‌మావేశాన్ని వాయిదా వేసింది. అయితే ఐసీసీ భేటీలో ఆసియా క‌ప్ నిర్వ‌హ‌ణ సాధ్య‌సాధ్యాల‌పై వీడియా కాన్ప‌రెన్స్ ద్వారా చర్చిస్తామని ఏసీసీ అధికారులు గురువారం పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులతో పాకిస్థాన్‌లో ఆడే ప్ర‌స‌క్తే లేద‌ని ఇప్ప‌టికే బీసీసీఐ స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్‌లో కాకుండా త‌ట‌స్థ వేదిక‌పై ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ స్ప‌ష్టం చేశారు. 
 
మ‌రోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వైఖ‌రి మాత్రం మ‌రోలా ఉంది. భార‌త్ కాకుండా మిగ‌తా దేశాల‌తో త‌మ సొంత‌గ‌డ్డ‌పై ఆసియా క‌ప్ మ్యాచ్‌లు ఆడిస్తే బాగుంటుంద‌ని పీసీబీ పేర్కొంది. మొత్తానికి మరో క్రీడా ఈవెంట్‌పై కరోనా వైరస్ ప్రభావం చూపిందని చెప్పొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఫ్రిదిని మెచ్చుకున్న భజ్జీ.. ప్రపంచమంతా బాగుండాలి