Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైమానిక దళానికి సెల్యూట్ : రాహుల్ గాంధీ

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:01 IST)
భారత వైమానిక దళానికి దేశ వ్యాప్తంగా ప్రశంలు వెల్లువెత్తుతున్నాయి. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి, ఆక్రమిత పాకిస్థాన్‌ భూభాగంలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై దాడులు మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.  ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా సైన్యం ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు.
 
వాయుసేన చేస్తున్న దాడులపై రాహుల్ గాంధీ ట్వట్టర్ ద్వారా స్పందిస్తూ అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న వైమానికి దళ పైలెట్లకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేసారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టిన వాయుసేన వీరులకు సెల్యూట్ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. 
 
అమరవీరుల త్యాగాలను వ్యర్థం కానివ్వమని ఇదివరకే చెప్పాం, ఒక భారతీయుడిగా ఈరోజు నేను గర్వ పడుతున్నానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భావోద్వేగం చెందారు. ఇలా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు సైన్యం ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments