సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉంటే...ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మపై మాటల యుద్ధం చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి వైసీపీ నాయకుడు కావడంతో వైసీపీ వాళ్లే కావాలనే వర్మతో ఈ సినిమాని తీయిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.
ఇప్పుడు వర్మ ట్విట్టర్లో ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి అతని స్నేహితుడు మిధున్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్ వరుసగా కూర్చోన్న ఫోటో పోస్ట్ చేసి రాకేష్ రెడ్డి అతని స్నేహితుడు అని చెప్పి ఆ తర్వాత కూర్చొన్న వ్యక్తి ఎవరో తెలియదు అన్నారు. జగన్ ఎవరో తెలియదు అని వర్మ అనడంతో ఓ వైపు టీడీపీ, మరోవైపు వైసీపీ షాక్ అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా వర్మ స్టైలే వేరు..!