Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా సచిన్...?

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (08:35 IST)
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌కు ఇన్‌చార్జిగా పైలట్‌ను నియమించాలనే ఆలోచనలో రాహుల్, ప్రియాంక ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ శుక్రవారంనాడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కూడా సచిన్‌తో సమావేశమయ్యారు. గాంధీలను సచిన్ కలుసుకోవడం వారంలో ఇది రెండోసారి.

సుమారు 45 నిమిషాల పాటు సచిన్, గాంధీల మధ్య సమావేశం జరిగింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌కు ఇన్‌చార్జిగా పైలట్‌ను నియమించాలనే ఆలోచనలో రాహుల్, ప్రియాంక ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో నాయకత్వ మార్పును పైలట్ ఆశిస్తున్నప్పటికీ, ఆ యోచనను ప్రస్తుతానికి వాయిదా వేయాలని రాహుల్, ప్రియాంక భావిస్తున్నట్టు చెబుతున్నారు.

కాగా, గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రచారానికి 44 ఏళ్ల సచిన్ పైలట్ అంగీకరించారా లేదా అనేది వెంటనే తెలియలేదు. రాజస్థాన్ క్యాబినెట్‌లో తన విధేయులకు చోటు కల్పించాలని పైలట్ పట్టుదలగా ఉన్నారు. గాంధీలతో జరిపిన సమావేశంలో ఈ అంశం చర్చించి ఉండొచ్చని అంటున్నారు.

గత ఏడాది జూన్ వరకూ రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పైలట్ ఆ పదవికి రాజీనామా చేయడంతో పార్టీ అధిష్ఠానం ఆయనను బుజ్జగించింది. పైలట్‌కు పార్టీ అధిష్టానం చేసిన వాగ్దానం ప్రకారం క్యాబినెట్‌లో మార్పులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి గెహ్లాట్ మీనమేషాలు లెక్కపెడుతుండటంతో గాంధీలను పైలట్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments