Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రారంభానికి ముందే కూలిపోయింది.. రూ.389 కోట్లు నీటిపాలు

ఆటవిక పాలనతోపాటు అవినీతి అక్రమాలకు నిలయంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో రూ.389 కోట్లు నీటిపాలయ్యాయి. ఈ రాష్ట్రంలోని భగల్‌పూర్‌లో రూ.389.31 కోట్ల వ్యయంతో చేపట్టిన గతేశ్వర్‌ పంథ్‌ కెనాల్‌ ప్రాజెక్టు ప్రారంభిం

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (14:06 IST)
ఆటవిక పాలనతోపాటు అవినీతి అక్రమాలకు నిలయంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో రూ.389 కోట్లు నీటిపాలయ్యాయి. ఈ రాష్ట్రంలోని భగల్‌పూర్‌లో రూ.389.31 కోట్ల వ్యయంతో చేపట్టిన గతేశ్వర్‌ పంథ్‌ కెనాల్‌ ప్రాజెక్టు ప్రారంభించడానికి 24 గంటల ముందే అపశ్రుతి చోటుచేసుకుంది. 
 
కెనాల్‌లోకి భారీగా నీరు రావడంతో అక్కడ నిర్మించిన గోడ కుప్పకూలింది. ఈ ప్రాజెక్టును బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ బుధవారం ప్రారంభించాల్సి ఉంది. అయితే.. ఈ ప్రమాదం కారణంగా ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కెనాల్‌ గోడ కూలిపోవడంతో నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది.
 
బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల రైతులకు నీటి సదుపాయాన్ని కల్పించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించారు. పనులు పూర్తికావడంతో ప్రయోగాత్మకంగా నీటిని నింపారు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ప్రాజెక్టు వద్ద నిర్మించిన గోడ కొట్టుకుపోయింది. 
 
ఖహలగాన్‌, ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. అక్కడ మునిగిపోయిన ఇళ్లలో ఖహల్‌గాన్‌ సివిల్‌ జడ్జి, సబ్‌జడ్జి నివాసాలు కూడా ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. 
 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments