కోయంబత్తూరులో కూలిన బస్టాండ్ శ్లాబ్.. 9 మంది మృతి
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సోమనూర్‌లో బస్టాండ్ శ్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో 9 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు శిథిలాల
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సోమనూర్‌లో బస్టాండ్ శ్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో 9 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొంత మంది గాయపడ్డారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మృత దేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.