Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#BlockNarendraModi హ్యాష్‌ట్యాగ్‌తో మోదీకి వ్యతిరేకత.. గౌరీ లంకేష్ హత్యకు తర్వాత?

#BlockNarendraModi పేరిట హ్యాష్ ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్లో దాదాపు 33.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే దేశంలోని సమస్యలను మోదీ పట్టించుకోకుండా విదేశీ పర్

#BlockNarendraModi హ్యాష్‌ట్యాగ్‌తో మోదీకి వ్యతిరేకత.. గౌరీ లంకేష్ హత్యకు తర్వాత?
, గురువారం, 7 సెప్టెంబరు 2017 (16:00 IST)
#BlockNarendraModi పేరిట హ్యాష్ ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్లో దాదాపు 33.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే దేశంలోని సమస్యలను మోదీ పట్టించుకోకుండా విదేశీ పర్యటనలు చేస్తుండటంపై ఆయనకు వ్యతిరేకంగా నెట్టింట #BlockNarendraModi అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. నరేంద్ర మోదీని బ్లాక్ చేయండి అంటూ నెటిజన్లు జోరుగా షేర్లు చేస్తున్నారు. 
 
కాగా సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించడానికి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో #BlockNarendraModi అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. భారీ ఎత్తున ఫాలోవర్స్ ఉన్నప్పటికీ.. మోదీని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. 
 
ట్విట్టర్లో #BlockNarendraModi పేరిట ప్రారంభమైన ఈ ట్వీట్ విప్లవం‌.. ప్రజల స్వతంత్ర్యం కావడంతో బీజేపీ నేతలు ఏం చేయాలో తోచక షాక్ అవుతున్నారు. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యానంతరం మోదీకి వ్యతిరేకంగా #BlockNarendraModi అనే హ్యాష్‌ట్యాగ్ ద్వారా బ్లాక్ చేసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేప్ చేశామని చెప్పేస్తావా? ఐతే చావు... యువతిపై రేప్, చంపి మూటగట్టి...