చెన్నై : టైల్స్ కంపెనీలో రూ.200 కోట్ల నల్లధనం ... ఎవరిదన్న కోణంలో ఆరా?

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:53 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. అదేసమయంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారులు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించారు. అలాగే, నగదు రవాణా అడ్డుకునేందుకు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను కూడా ఈసీ నియమించింది. 
 
ఈ క్రమంలో చెన్నై నగరంలో భారీగా నల్లధనాన్ని అధికారులు గుర్తించారు. ఓ ప్రముఖ టైల్స్‌ అండ్‌ శానిటరీవేర్‌ తయారీ కంపెనీపై ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో 220 కోట్ల రూపాయల లెక్కకు చూపని డబ్బు వెలుగుచూసింది. 
 
ఫిబ్రవరి 26వ తేదీన జరిపిన సోదాల్లో మొదట రూ.8.30 కోట్లు సీజ్‌ చేసినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్స్‌ అధికారులు తెలిపారు. టైల్స్‌కు సంబంధించి లెక్క చూపని కొనుగోలు, అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు. ఇందుకోసం ఓ రహస్య ఆఫీసుతో పాటు, ఓ సాఫ్ట్‌వేర్‌ను సైతం ఉపయోగించినట్లు కనుగొన్నారు.
 
యాభై శాతానికి పైగా లావాదేవీలు రికార్డు చేయలేదని తెలిపారు. మొత్తం 220 కోట్ల రూపాయల లెక్కకు చూపని డబ్బును గుర్తించామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ఈ డబ్బును ఉపయోగించాలనుకున్నారా అన్న దానిపై విచారణ చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments