Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రోజా.. బీజేపీతో లాలూచీ పడి?

ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైకాపా నేత రోజా నిప్పులు చెరిగారు. తిరుమలలో జరుగుతున్న విషయాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భయంతోనే సమాచార హక్కు చట్టం పరిధిలోకి టీటీడీని తేవడానికి చంద్రబాబు అ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (10:53 IST)
ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైకాపా నేత రోజా నిప్పులు చెరిగారు. తిరుమలలో జరుగుతున్న విషయాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భయంతోనే సమాచార హక్కు చట్టం పరిధిలోకి టీటీడీని తేవడానికి చంద్రబాబు అంగీకరించడం లేదని రోజా వ్యాఖ్యానించారు.


ఈ విషయంలో తమ పార్టీ పోరాటం చేస్తుందని రోజా చెప్పారు. దేవదేవుని సన్నిధిలో జరుగుతున్న అన్ని అంశాలూ పారదర్శకంగా వుండాలని.. భక్తులకు సమాచారం ఇచ్చేందుకు టీటీడీకి అభ్యంతరం ఎందుకని ఆమె ప్రశ్నించారు. వెయ్యి కాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించాలని రోజా డిమాండ్ చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ జోన్, కడప ఉక్కు కర్మాగారాలు సహా అన్ని హామీలపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. బీజేపీతో చంద్రబాబు లాలూచీ పడి, చంద్రబాబు ప్రజలను వంచిస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టారని రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సీఎం చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లిపోయిందని, ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యనించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలోనే ఎవరికీ ఇవ్వని ప్యాకేజీ ఏపీకి ఇచ్చారని అసెంబ్లీలో తీర్మానం చేయడం నిజం కాదా అని రోజా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments