Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుస్తులిప్పేసి ఆయనతో ఉల్లాసంగా ఉండండి.. అమ్మాయిలకు హాస్టల్ వార్డెన్ ఆర్డర్

అమ్మాయిలను కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్ మహిళా వార్డన్.. నీచానికి దిగజారింది. తాను వార్డెన్‌గా ఉంటున్న హాస్టల్‌ నిర్వాహకుడితో ఐదుగురు అమ్మాయిలను వంటిపై నూలుపోగులేకుండా నగ్నంగామారి.. ఉల్లాసంగా ఉండ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (10:21 IST)
అమ్మాయిలను కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్ మహిళా వార్డన్.. నీచానికి దిగజారింది. తాను వార్డెన్‌గా ఉంటున్న హాస్టల్‌ నిర్వాహకుడితో ఐదుగురు అమ్మాయిలను వంటిపై నూలుపోగులేకుండా నగ్నంగామారి.. ఉల్లాసంగా ఉండాలంటూ హుకుం జారీచేసింది. ఆ విద్యార్థినిలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చేరవేయడంతో కథ అడ్డం తిరిగి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కోయంబత్తూరు పీలమేడు బాలరంగనాధపురంలో 'దర్శనా' పేరుతో ఓ మహిళా వసతి గృహం ఉంది. ఇక్కడ అనేక మంది అమ్మాయిలు బస చేస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే, ఇటీవల ఆ హాస్టల్‌ నిర్వాహకుడు జగన్నాథన్‌ (48) పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఆ సందర్భంగా పుట్టిన రోజు పార్టీ కోసమంటూ ఐదుగురు అమ్మాయిలను హాస్టల్‌ వార్డెన్‌ పునిత (32) తీసుకెళ్ళారు. 
 
పార్టీ అయిన తర్వాత జగన్నాథన్‌తో నగ్నంగా మారి ఉల్లాసంగా గడుపమంటూ వారిని బలవంతపెట్టింది. అందుకు అంగీకరించని ఆ యువతులు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చేరవేశారు. వారు పోలీసులకు వారు ఫిర్యాదు చేయడంతో అరెస్టు భయంతో జగన్నాథన్‌, పునీత కనిపించకుండా పారిపోయారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజులకు ముందు హాస్టల్‌ నిర్వాహకుడు జగన్నాధన్‌ తిరునల్వేలి జిల్లా ఆలంకుళం వద్దనున్న బావిలో అనుమానాస్పద రీతిలో శవంగా పడి ఉండగా కనుగొన్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పునీత... అజ్ఞాతవాసం వీడి బుధవారం ఉదయం కోయంబత్తూరు ఆరో నెంబర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో లొంగిపోయింది. ఆమెను ఈ నెల 14 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు పునీతను కోయంబత్తూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. పోలీసులు పునీతను తమ కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు సన్నాహాలు చేపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments