Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీసీ సమీప బంధువు హత్య.. 2 రోజులు కారులో తిప్పారు.. వివాహేతర సంబంధమే?

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం సమీప బంధువు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన తమిళనాట కలకలం రేపింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరప్పూరు శివారు ఊత్

పీసీ సమీప బంధువు హత్య.. 2 రోజులు కారులో తిప్పారు.. వివాహేతర సంబంధమే?
, గురువారం, 28 జూన్ 2018 (12:02 IST)
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం సమీప బంధువు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన తమిళనాట కలకలం రేపింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరప్పూరు శివారు ఊత్తుకుళి రోడ్డులోని కురుమారం పాళయంకోటకు చెందిన శివమూర్తి (47) బనియన్ల పరిశ్రమ నిర్వహించేవారు. ఈయన పీసీకి సమీప బంధువు. ఇతడు తన కంపెనీలో పనిచేసే మహిళతో సన్నిహిత సంబంధం ఏర్పరుచుకున్నాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ భర్త పలుమార్లు శివమూర్తిని హెచ్చరించాడు. అయినా అతని పద్దతి మార్చుకోలేదు. దీంతో హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఈ నెల 25న శివమూర్తి కిడ్నాప్‌కు ప్లాన్ వేశాడు. అదే రోజు శివమూర్తి కోయంబత్తూరు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. అయితే, రెండు రోజులైనా అతడి నుంచి సమాచారం లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివమూర్తి కారులోని జీపీఎస్ పరికరం ద్వారా విచారణ ప్రారంభించిన పోలీసులు ఆయన కారు వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని వెంగుళి గ్రామం మీదుగా వెళ్తున్నట్టు గుర్తించారు.
 
వెంటనే వేలూరు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు. కారును గుర్తించి అందులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి బయటపడింది. శివమూర్తిని కిడ్నాప్‌ చేసి మేట్టుపాళయం సమీపంలోని వెళ్లియంకాట్టులో హత్య చేసినట్లు నిందితులు చెప్పారు. మృతదేహాన్ని రెండు రోజుల పాటు కారులోనే తిప్పామని, చివరికి మృతదేహం పైకి తేలకుండా ఉండేందుకు బండరాయి కట్టి, హోసూరు శివారులోని కెలవరపల్లి జలాశయంలో పడేసినట్లు వివరించారు. బుధవారం మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు హత్యకు ప్రధాన సూత్రధారి అయిన మూర్తిని అదుపులోకి తీసుకుని.. విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హమ్మయ్య భగవాన్ బదిలీకి బ్రేక్.. విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవ్..