Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగలు పరుగెత్తుతుంటే.. వెనుక గన్‌మెన్లు.. సినీ ఫక్కీలో ఏటీఎం చోరీ...

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (16:14 IST)
ఏటియంలో డబ్బులు పెట్టడానికి ఓ నలుగురు వ్యాన్ దిగారు. బాక్స్‌లలో ఫుల్‌గా క్యాష్ ఉంది. ఇంతలో తుపాకుల శబ్దం. అక్కడే రిక్షావాడు కునుకుతీస్తున్నాడు. పెద్ద శబ్దాలు వినిపించడంతో మేలుకున్నాడు. దాడి చేస్తున్న ముగ్గురిని గమనించాడు. వాళ్లు సిబ్బందిపై కాల్పులు జరిపారు. దోరికింది దోచుకున్నారు. దాదాపు 40 లక్షలు. రిక్షావాడు వారిని అడ్డుకుందామనుకున్నాడు, కానీ ఒకడు అతనిపై తుపాకీ పెట్టి బెదిరించాడు. ఏమీ చేయలేక మిన్నుకుండిపోయాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. 
 
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 82. కేంద్రీయ విహార్ సొసైటీ గేట్ నెంబర్ 2 వద్ద ఉన్న ఓ ఎస్బిఐ ఏటియం వద్ద ఈ తతంగం అంతా జరిగింది. నగదు పెట్టేవాళ్లు వాళ్ల ప్రయత్నాన్ని విరమించుకోలేదు. దొంగల వెనుక పడ్డారు. ముందర దొంగలు పరిగెత్తుతుండగా వెనుక గన్‌లతో నలుగురు వెంట పడ్డారు. చెవులు అదిరిపోయేలా కాల్పులు. బైక్‌లో వెళుతున్న దొంగలకు ఎదురుదెబ్బ, ఓ కార్ అడ్డంగా వచ్చి బైక్‌ని ఢీకొట్టింది. 500 రూపాయల నోట్లు గాల్లో ఎగురుతున్నాయి. 
 
కొన్ని కట్టలు క్రిందపడిపోయాయి. జనం హోరెత్తారు. డబ్బుల కోసం ఎగబడ్డారు. ఓ పిల్లాడు 500 రూపాయల కట్టలను తీసుకుని పరిగెత్తాడు. జనం దొరికింది దొరికినట్లు తీసుకుని పారిపోయారు. పండుగ వాతావరణం నెలకొంది. ఇంతలో పోలీసులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. ప్రజల ఖాతాలలోకి వెళ్లిన సొమ్ము దాదాపు 20 లక్షలు అని చెబుతున్నారు. మిగతా ధనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments