Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీ పౌడర్‌లో కేన్సర్ కారక యాస్బెస్టాస్ .. సమన్లు జారీ

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:28 IST)
బేబీ పౌడర్‌ తయారీలో కేన్సర్ కారక యాస్బెస్టాస్ కలుపుతున్నారనే ఆరోపణలపై దాఖలైన కేసులో అమెరికా న్యాయశాఖకు, సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్‌కు (ఎస్ఈసీ) సమన్లు జారీ చేసినట్టు జాన్సన్ అండ్ జాన్సన్ బుధవారం తెలిపింది. ఈ కేసు విచారణలో తాము అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. 
 
బుధవారం తన వార్షిక నివేదికను ప్రకటిస్తూ జాన్సన్ అండ్ జాన్సన్, బేబీ పౌడర్ ఉత్పత్తులపై ఫెడరల్ ఏజెన్సీల నుంచి సమన్లు అందుకున్నట్టు మొట్టమొదటిసారి బహిర్గతం చేసింది. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు న్యాయ శాఖ, ఎస్ఈసీ నిరాకరించాయి. 
 
కాగా, ఈనెల 14వ తేదీన ప్రముఖ రాయిటర్స్ వార్తా సంస్థ ఓ వార్తకథనంలో జాన్సన్ అండ్ జాన్సన్ కొన్ని దశాబ్దాలుగా తన బేబీ పౌడర్, పౌడర్ ఉత్పత్తుల్లో తక్కువ పరిమాణంలో కార్సినోజెన్ అనే యాస్బెస్టాస్‌ను కలుపుతోందని ఓ కథనంలో పేర్కొంది. 
 
1970ల నుంచి 2000ల ఆరంభం వరకు నిర్వహించిన అనేక పరీక్షల్లో కార్సినోజెన్ ఛాయలు బయటపడినట్టు పేర్కొంది. ఈ విషయం తెలిసినప్పటికీ జాన్సన్ అండ్ జాన్సన్ ఎప్పుడూ దీని గురించి రెగ్యులేటర్స్‌కి కానీ, ప్రజలకు కానీ చెప్పలేదు. ఈ విషయం తెలిసిన తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తన షేర్లను భారీగా విక్రయించింది. ఫలితంగా కంపెనీ కేవలం ఒక్కరోజులో సుమారుగా 40 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ వాల్యూ నష్టపోయింది. ఈ ఆరోపణలపై ఓ కేసు నమోదు కాగా, ఈ కేసులో సమన్లు జారీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments