Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాన్సన్ అండ్ జాన్సన్‌ బేబీ పౌడర్‌లో కేన్సర్ కారకాలు...

Advertiesment
Johnson and Johnson
, ఆదివారం, 16 డిశెంబరు 2018 (14:05 IST)
గత కొన్నేళ్లుగా బేబీ పౌడర్ ఇండస్ట్రీని శాసిస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఇపుడు చిక్కుల్లో పడింది. ఆ సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్లో ఒకటైన బేబీ పౌడర్‌లో కేన్సర్ కారకాలు ఉన్నట్టు తేలింది. దీనికి సంబంధించి ప్రముఖ పత్రిక రాయిటక్ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. దీంతో ఆ కంపెనీ షేర్లుకుప్పకూలిపోయిం. ఫలితంగా రూ.3 లక్షల కోట్లు ఆవిరై పోయాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బేబీ పౌడర్‌తోపాటు షవర్ టూ షవర్ ఉత్పత్తుల్లోనూ ఆస్‌బెస్టాస్‌తోపాటు విష రసాయనాలు ఉన్నట్లు అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ తెలిపింది. తమ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు జాన్సన్ సంస్థకు ముందే తెలుసునన్నది. బేబీ పౌడర్‌లో ఆస్‌బెస్టాస్ ఉన్న సంగతిని 1971లోనే జాన్సన్ సంస్థ గుర్తించినా ఇంతకాలం ప్రపంచాన్ని ఆ సంస్థ మభ్యపెట్టిందన్నది. 
 
ఇది చాలా తక్కువ మోతాదు అని, హానికరం కాదని నియంత్రణ సంస్థలను ఒప్పించేందుకు జాన్సన్ సంస్థ ప్రయత్నించిందని రాయిటర్స్ పేర్కొంది. ఆసెబెస్టాస్ వల్ల ప్రమాదకర మెసోథిలియోమా వంటి అరుదైన, భయంకరమైన కేన్సర్ సోకే అవకాశం ఉందన్నది. జాన్సన్ సంస్థ దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల్ని మోసగిస్తున్నదని తెలిపింది. జాన్సన్ కంపెనీపై వివిధ కోర్టులో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను అధ్యయనం చేసి ఈ కథనాన్ని ప్రచురించినట్లు రాయిటర్స్ తెలిపింది. 
 
అయితే, రాయిటర్స్ ఆరోపణలు ఆ సంస్థ కొట్టిపారేసింది. ఇవి పూర్తిగా కల్పితం, నిరాధారమని పేర్కొంది. తమ ఉత్పత్తుల్లో ఏ క్యాన్సర్ కారకాలు లేవని గతంలో జరిపిన వేల పరీక్షల్లో తేలిందని సంస్థ గ్లోబల్ మీడియా రిలేషన్స్ ఉపాధ్యక్షుడు ఎర్ని న్యూటిజ్ తెలిపారు. బేబీ పౌడర్‌లో ఆస్‌బెస్టాస్ లేదన్నారు. తమ ఉత్పత్తుల్ని నాణ్యతా ప్రమాణాల మేరకు, వివిధ ల్యాబ్‌ల్లో పరీక్షించాకే మార్కెట్‌లోకి విడుదల చేస్తామని వివరణ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నువ్వంటే నాకిష్టం' అంటూ పరాయి స్త్రీతో నమ్మించి భర్తను హత్య చేసిన భార్య