Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషులను సన్మానించడం తప్పే : దేవంద్ర ఫడ్నవిస్

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (14:56 IST)
గత 2002లో జరిగిన బిల్కిస్ బానో అత్యాచార కేసులో ముద్దాయిలుగా తేలిన వారిని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విడుదల చేసి వారిని సన్మానించడం ముమ్మాటికీ తప్పేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. 
 
2002 నాటి గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై జరిగిన అత్యాచార ఘటనలో దోషులను గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. జైలు నుంచి విడుదైలన తర్వాత వీరికి బయట ఘనస్వాగతం పలికింది. వీరికి పూలమాలలు వేసి ఘన సన్మానం కూడా చేశారు. ఇదే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఇలాంటి అత్యాచారం దోషులను విడుదల చేయడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా తప్పుబడుతున్నారు. 
 
ఈ కోవలోనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అత్యాచార కేసులోని ముద్దాయిలకు ఘన స్వాగతం పలకడం ముమ్మాటికీ తప్పేనని చెప్పారు. దోషి అంటే దోషేనని, వారికి సన్మానాలు జరపడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు దోషులను విడుదల చేశారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అందువల్ల ఈ అంశాన్ని చట్టసభల్లో చర్చించడం అనవసరమని ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments