Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త ఇస్తే నచ్చింది తినొచ్చు.. తాగొచ్చు.. ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (15:19 IST)
గుజరాత్‌లోని జునాగఢ్‌లోని కేఫ్‌ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిందే. పర్యావరణానికి తూట్లు పొడిచే ప్లాస్టిక్ చెత్తను తీసుకొచ్చి ఇస్తే చాలు. ఇంట్లో ప్లాస్టిక్ చెత్త ఉంటే, ఓ సంచిలో వేసుకుని సరి. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వినూత్న ప్రయత్నమే ఈ కేఫ్. 
 
దీని వల్ల ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన సైతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒక్కసారి వినియోగానికి పనికొచ్చే ప్లాస్టిక్ ఉత్పత్తులపై జులై 1 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. 
 
ఈ కేఫ్‌లోని ఆహార పదార్థాల్లో సహజసిద్ధంగా పండించిన ముడి సరుకులను వినియోగిస్తారు. సర్వోదయ సాక్షి మండల్ ఈ కేఫ్ నిర్వహణను చూడనుంది. పర్యావరణంగా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన పట్టణంగా జునాగఢ్‌ను తీర్చిదిద్దాలన్నది తమ ప్రయత్నమని అధికారులు చెప్పారు. 
 
అర కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకెళ్లి ఇస్తే గ్లాసు నిమ్మరసం ఇస్తారు. కిలో చెత్తకు ఒక పోహ వడ్డిస్తారు. ఈ రెస్టారెంట్ సమీకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఒక ఏజెన్సీని నియమించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments