Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రోజుల శిశువును ఎత్తుకెళ్లిన కుక్క... ఎక్కడంటే?

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (15:00 IST)
హర్యానాలోని పానిపట్టులో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన జరిగింది. మెటర్నరీ ఆస్పత్రిలోకి వెళ్లిన కుక్క తల్లి పొత్తిళ్లలో ఉన్న మూడు రోజుల శిశువును ఎత్తుకెళ్లాయి. కాగా ఆ శిశువు తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. 
 
పానిపట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో షబ్నం అనే మహిళ మూడు రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఆసుపత్రిలోకి ప్రవేశించిన కొన్ని శునకాలు ఆ తల్లి పక్కన ఉన్న శిశువును నోట కరుచుకుని వెళ్లాయి. ఆ సమయంలో తల్లి షబ్రం సహా ఇద్దరు బంధువులు నిద్రలో ఉన్నారు.
 
రాత్రి  2.15 గంటల సమయంలో తల్లి లేచి చూడగా బిడ్డ కనిపించలేదు. ఈ విషయాన్ని వెంటనే ఆస్పత్రికి యాజమాన్యానికి తెలియజేశారు. దీంతో అలర్టైన ఆసుపత్రి సిబ్బంది, శిశువు బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. 
 
అయితే హాస్పిటల్ సమీపంలో ఉన్న ఓ ప్రాంతంలో ఓ కుక్క శిశువును నోట కరుచుకుని ఉండడం గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, అప్పటికే  శిశువు తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 
 
ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments