Webdunia - Bharat's app for daily news and videos

Install App

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (12:05 IST)
టాటా సన్స్ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తుల్లో సింహ భాగాన్ని దాతతృత్వానికే కేటాయించారు. మిగిలిన దానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాశారు. గత యేడాది అక్టోబరు 9వ తేదీన ఆయన మరణించారు. తనకున్న రూ.3,800 కోట్ల ఆస్తిపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన ఈ వీలునామాపై సంతకం చేశారు. 
 
ఆస్తిలో సింహభాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులకు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆ నిధులను దాతృత్వానికి వినియోగిస్తాయి. వీలునామాలో రాయని షేర్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులూ ఈ దాతృత్వ సంస్థలకే చెందుతాయని వీలునామా రతన్ టాటా పేర్కొన్నారు. 
 
రూ.800 కోట్లలోని మూడో వంతును టాటా సంస్థ మాజీ ఉద్యోగి, తనకు అత్యంత ఆప్తులైన మోహిని ఎం దత్తాకు ఇచ్చారు. ముంబైలోని జుహూలోని భవనంలో వాటా, వెండి వస్తులు, కొన్ని ఆభరణాలను తన సోదరుడైన 82 యేళ్ల జిమ్మ నావల్ టాటాకు రాసిచ్చారు. తన ప్రాణస్నేహితుడైన మెహ్లీ మిస్త్రీకి అలీబాగ్‌లోని ఇంటిని, మూడు తుపాకులను ఇచ్చారు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్టాక్స్, ఇతర విలువైన వాటిలో కలిపి మొత్తం రూ.800 కోట్ల ఆస్తుల్లో మూడో వంతును తన సవతి తల్లి కుమార్తెలు షరీన్ జేజీబాయి, డియాన్నా జేజీబాయికి రతన్ టాటా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments