సాక్ష్యం చెప్పకుండా అత్యాచార బాధితురాలికి విషం తాగించారు...

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (15:54 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ రేప్ కేసులో సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు అత్యాచార బాధితురాలికి ఇద్దరు యువకులు విషం తాగించారు. ఢిల్లీలోని ద్వారకా జిల్లా హస్తసాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
హస్తసాల్ ప్రాంతానికి చెందిన 17 యేళ్ళ యువతి ఓ అత్యాచార కేసులో ప్రధాన సాక్షి. ఈమె గత గురువారం ట్యూషన్‌కి వెళ్లి వస్తుండగా, ఇద్దరు యువకులు అడ్డగించి బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కోర్టులో నిందితుడిపై సాక్ష్యం చెప్పొద్దంటూ ప్రాధేయపడ్డారు. అందుకు ఆమె నిరాకరించింది. 
 
దీంతో ఆమెతో బలవంతంగా విషం తాగించి, అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు స్పృహకోల్పోయి కిందపడింది. దీన్ని గమనించిన గమనించిన స్థానికులు ఓ ఆటో రిక్షాలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. 
 
శుక్రవారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులపై ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఇద్దరు నిందితులు అత్యాచారం కేసులో ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర లో ఆర్‌పిఎఫ్ పాత్ర గురించి రవితేజ ఏమన్నాడో తెలుసా!

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్

Yash: కేజీఎఫ్ చాప్టర్-2తో టాక్సిక్ పోటీపడలేదు.. యష్ వల్లే అంతా జరిగింది: కేఆర్కే

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments