Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్న కూతురుపై రేప్... సోదరులను కూడా పిలిచి గ్యాంగ్ రేప్...

Advertiesment
కన్న కూతురుపై రేప్... సోదరులను కూడా పిలిచి గ్యాంగ్ రేప్...
, మంగళవారం, 8 జనవరి 2019 (12:38 IST)
రానురాను మనషుల్లో కొందరు పశువులుగా మారిపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి తన కన్ను కూతురుని కాటేసిన దారుణమైన ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు సంవత్సరాలుగా తన కుమార్తెపై నిత్యం అత్యాచారం చేస్తున్న ఈ కామాంధుడు, తన సోదరులను పిలిచి వారితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు తెలిపారు. కోయంబత్తూరులో చదువుకుంటున్న ఓ విద్యార్థిని లైంగిక వేధింపుల అవగాహన కార్యక్రమంలో ఈ విషయం బయటపెట్టింది. తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి బాలిక చెపుతుంటే అధికారులు షాక్ తిన్నారు. తనపై తన తండ్రి, చిన్నాన్నలిద్దరూ గత 2016 నుంచి అత్యాచారం చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. దీనితో అధికారులు వెంటనే స్పందించి సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో నిందితులను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ బంద్ : దేశవ్యాప్తంగా ఎఫెక్టు - కేరళలో తీవ్రం.. నిలిచిన బ్యాంకు సేవలు